పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొనసాగుతున్న రామాలయ వివాదం, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చలో ఆకివీడు కార్యక్రమాలు టెన్షన్ పెంచాయి. అటు హిందూ సంఘాలు, ఇటు క్రిస్టియన్ సంఘాలు పోటాపోటీగా ఛలో అకివీడు అంటూ పిలుపు ఇవ్వడం ఉత్కంఠను పెంచేసింది. చలో ఆకివీడుకు ఎవరికీ ఎలాంటి పర్మిషన్ లేదని అధికారులు ప్రకటించారు. చలో ఆకివీడుకు పిలుపునిచ్చిన కరాటే కళ్యాణిని కూడా పోలీసులు కైకలూరులో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా.. పోలీసుల తీరుపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

