
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత పడుతోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి కృష్ణా జిల్లా వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను పంపాలని హోంమంత్రిని ఆదేశించారు..