అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 296 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

