ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. సభలో పాలకవర్గం, వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు సభగా సాగింది. సభలో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై దుమారం చెలరేగింది. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలు చేసింది అధికార పక్షం. గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు అయితే దీనిపై స్పందించిన స్పీకర్ సభలో ఆందోళన చేసిన బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు, రేపు BRS సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

