
దివంగత లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, కనకరత్నమ్మ (94) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు కనకరత్నమ్మ దశదినకర్మ నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్.. అనంతరం కనకరత్నమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులు అర్పించారు.