తమిళ అగ్ర కథానాయకుడు, కార్ రేసర్ అజిత్ కుమార్‌కి అరుదైన గౌరవం దక్కింది. సినీ ఐకాన్‌గా తన ప్రయాణంతో పాటు, ప్రొఫెషనల్ రేసర్‌గా ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘జెంటిల్‌మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం లభించింది. ఇటలీలోని వెనిస్ నగరంలో జీటీ రేసింగ్‌లో ప్రపంచ అగ్రగామిగా పరిగణించబడే ఎస్‌ఆర్‌ఓ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ సీఈఓ స్టెఫాన్ రాటెల్ చేతుల మీదుగా అజిత్ ఈ అవార్డును అందుకున్నారు.

