సిట్ విచారణలో ఏం జరిగిందో హరీష్ రావు మాటల్లోనే ఏమన్నారంటే.. ఈరోజు సిట్ విచారణలో నన్ను అధికారులు అడిగిందే అడిగారు. సొల్లు పురాణం తప్ప ఏమిలేదు. ఓ అరగంట అడగానే బయట నుండి ఫోన్లు వస్తున్నాయి. మరో అరగంట అడగగానే సైగలొస్తాయి. మళ్లీ వెళ్లి ఫోన్ మాట్లడి వచ్చి అడుగుతున్నారు. ఆ ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, సీపీ సజ్జనార్ చేస్తున్నాడో తెలియాలి. విచారణ సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే ముగ్గురు అధిాకారులు బయటకు పోతున్నారు. అడిగిందే అడుగుతున్నారు.

