అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బొలెరో వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా రైల్వే పనుల కోసం వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అరకు నుండి ఎస్.కోట వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

