
టీమ్‌ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. మార్చి నెలకు గాను అయ్యర్‌కు ఈ అవార్డు దక్కింది. భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్.. ఆ టోర్నీలో 243 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు జాకబ్ డఫ్ఫీ, రచిన్ రవీంద్ర ఈ అవార్డుకు పోటీపడ్డా అయ్యర్ విజేతగా నిలిచాడు.