
అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన క్రతువు పూర్తి చేసినట్లుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్లపక్ష విదియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రతిష్టించినట్లు తెలిపారు. రామ మందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. రామ్దర్భార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు.