
అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్‌లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తనిఖీ చేసే చట్టబద్ధ అధికారం సీబీపీ అధికారులకు ఉంది. ప్రయాణికుల పౌరసత్వం, వీసా స్టేటస్ వంటి వాటితో సంబంధం లేకుండా తనిఖీ చేస్తారు. బేసిక్ సెర్చ్, అడ్వాన్స్డ్ సెర్చ్ అనే రెండు విధాలుగా ఎలక్ట్రానిక్ డివైస్ల తనిఖీలు జరుగుతాయి. బేసిక్ సెర్చ్‌లో సీబీపీ ఆఫీసర్ డివైస్‌ను తనిఖీచేస్తారు. అన్‌లాక్ అయి ఉన్నా, ప్రయాణికుడు పాస్‌వర్డ్‌ను ఇచ్చినా సరిపోతుంది.