
అగ్రరాజ్యం అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో అమెరికన్‌ను లేదా గ్రీన్‌కార్డు పొందిన వ్యక్తులను వివాహం చేసుకుంటే వెంటనే పౌరసత్వం లభించేది. చాలా సందర్భాల్లో ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే వారి భాగస్వాములకు అమెరికా పౌరసత్వాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అమెరికన్‌ను, గ్రీన్‌కార్డు పొందిన వారిని పెళ్లి చేసుకున్నా పౌరసత్వం పొందేందుకు చాలానే కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ప్రతీ చిన్న విషయంతో పాటు భాగస్వామి అలవాట్ల గురించి పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. అలా అయితేనే వీరిక కూడా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది.