ఇరాన్ నుంచి వెలువడే టెహ్రాన్ టైమ్స్ తమ దేశానికి వస్తున్న అమెరికా బలగాలకు అరుదైన ఆహ్వానం పలికింది. వెల్ కమ్ టూ హెల్ (నరకానికి ఆహ్వానం) అంటూ అమెరికా బలగాల ఫొటోతో టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన ముఖ చిత్రం ఇరాన్ వైఖరికి అద్దం పట్టేలా ఉందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది. ఇప్పటికే అమెరికా బలగాలు తమ దేశంలో అడుగుపెడితే చాలా విపరిణామాలు చవి చూడాల్సి వస్తుందని అగ్రనాయకులు సైతం హెచ్చరికలు చేస్తున్నారు.

