
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తూ, భారత్ తన ఇంధన వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులు పెద్దగా పెంచుతోంది.భారతదేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈ ఆగస్టులో 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కోసం అమెరికాకు ఆర్డర్ వేసింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలపైనే ఆధారపడింది.