
రష్యా దాడులు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు అమెరికా మరోసారి ముందుకొచ్చింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను బలపరచే ఉద్దేశ్యంతో 3,350కిపైగా అధునాతన ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM) క్షిపణులను సరఫరా చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. అయితే, ఈ క్షిపణులను రష్యా భూభాగంపై ఉపయోగించాలంటే పెంటగాన్ నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి అని షరతు విధించారు.