టెక్ దిగ్గజం గూగుల్ తన విదేశీ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా వీసాపై పనిచేస్తున్న సిబ్బంది ప్రస్తుతానికి అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని కంపెనీ గట్టిగా హెచ్చరించింది. అమెరికా ఎంబసీల్లో వీసా ప్రాసెసింగ్లో
విపరీతమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగులు విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా అమెరికాలో హెచ్-1బి, ఎల్-1 వంటి వీసాలపై పనిచేసే వేలాది మంది భారతీయులతో పాటు ఇతర దేశస్థులు పండుగ సెలవులకు లేదా వ్యక్తిగత పనులపై తమ స్వదేశాలకు వెళ్తుంటారు.

