గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. అయితే ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు వాషింగ్టన్‌తో కలిసిహై లెవల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్‌లు వాషింగ్టన్‌లోని డెన్మార్క్ ఎంబసీలో సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

