
అమెరికా, ఇజ్రాయెల్ తో ఎప్పుడు అయినా యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడైన యాహ్యా రహీమ్ సఫావీ తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ”మేము శాంతి ఒప్పందాల్లో లేము. యుద్ధానికి సిద్ధమవుతున్నాం” అని సఫావీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఎలాంటి ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు యుద్ధమొకటి జరగొచ్చు. దానితోనే అంతం కావచ్చు” అని ఆయన హెచ్చరించారు.