మెరికాలో షట్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే బిల్లును బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం కోసం పంపారు. దీంతో ఆ బిల్లుపై సంతకం చేయగా… అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా కొనసాగిన 43 రోజుల షట్‌డౌన్ అధికారికంగా ముగిసింది. డెమొక్రాట్ల కారణంగా తాము ఈ స్వల్పకాలిక విపత్తును ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ అద్భుతమైన బిల్లుపై సంతకం చేసి, అమెరికాను తిరిగి పని చేయించుకోవడం ఇప్పుడు గౌరవంగా ఉందని ట్రంప్ అన్నారు.

