
అమెరికాలోని టెన్నెస్నీ రాష్ట్రం ఓ మిలిటరీ యుద్ద సామాగ్రి ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్‌కు చెందిన కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో 19 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి కారు ఎగిరిపడ్డాయి. మంటలు అంటుకోవడంతో కార్లతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ పేలుళ్ల కొన్ని కిలో మీటర్ల వరకు వినిపించాయి. పోలీసులు, ఎఫ్బిఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.