మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అశాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని లారిజానీ విమర్శించారు. ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నుండి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని లారిజానీ తెలిపారు.

