
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో హోం మంత్రి అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా
ముందుగా షెడ్యుల్ కూడా ఖరారు అయింది. కానీ ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కలిసి ఆయన అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీంతో తన హైదరాబాద్ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.