రెండోదశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం (నవంబర్ 27) అన్నారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు లేవని చెప్పారు. రెండో దశ భూసేకరణ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ భూమితో కలిపి రెండో దశలో 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

