ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేదని, దానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ‘ప్రజావేదిక’ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ ‘మూడు ముక్కలాట’పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందిన వారికి కాలం చెల్లిందని, అమరావతిని ఇక ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని జగన్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

