
వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అమన్‌జోత్ కౌర్ (50 నాటౌట్), దీప్తి శర్మ(38 నాటౌట్)లు కీలక భాగస్వామ్యంలో జట్టు స్కోర్ 200 దాటించారు. దాంతో.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. 40వ ఓవర్ పూర్తికాగానే వర్షం మొదలైంది. దాంతో.. ఇరుజట్ల ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు.