మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో త్రాగు నీరు కాలుష్య ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందగా, సుమారు 1500 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీటి కాలుష్యం ఘటన గురించి ఎన్డీటీవీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మంత్రి కైలాశ్ విజయవర్గీయా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి బిల్లులు ఎందుకు చెల్లించలేదని, ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదని జర్నలిస్టు ప్రశ్న వేశారు. అయితే అనవసర ప్రశ్నలు వేయకండి అన్న మంత్రి ఆ తర్వాత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

