
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలంటూ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటకం, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో విక్టోరియా సాధించిన ప్రగతిని, సాంకేతిక నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన మెల్‌బోర్న్‌లో విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌తో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.