అన్న అనే పేరుకే జగన్ కళంకం అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె… వివేకానంద రెడ్డి హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని షర్మిల స్పష్టం చేశారు. కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి సరికాదని, ఆయనకు టికెట్ ఇవ్వవద్దని వివేకా స్వయంగా నాతో చెప్పారు అని ఆమె గుర్తు చేశారు. వివేకా బతికి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి అవుతారని భావించే అవినాష్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

