గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 భోజనం పథకం అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ‘ఇందిరా క్యాంటీన్’గా మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రంగా స్పందించారు. మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. దిల్లీ పెద్దల ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అంత అవసరం ఉంటే మీ పేరు మార్చుకోవచ్చు కదా, రేవంత్ రెడ్డి తన పేరును మార్చుకుని ‘రాజీవ్’ లేదా ‘జవహర్’ అని పెట్టుకుంటే బాగుంటుందని కేటీఆర్ సూచించారు.

