స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వివాహానికి సంబంధించి గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి Team Anushka ముగింపు పలికింది. వివాహం అనేది ఒకరి వ్యక్తిగత విషయమని, అది బ్రేకింగ్ న్యూస్ లేదా ట్రెండ్ కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా అనుష్క వయసును (44 ఏళ్లు) ప్రతి వార్తలోనూ హైలైట్ చేయడంపై ఆమె టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోల వయసు గురించి చర్చించని వారు, హీరోయిన్ల విషయంలోనే ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారని ప్రశ్నించారు.

