
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) అనే నినాదంతో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాం అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అని కొత్త ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి, దాని అధిపతిగా ఎలాన్ మస్క్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.