కేంద్రం ప్రతిఏటా అందించే జాతీయ చేనేత అవార్డులు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు చేనేత కార్మికులను వరించాయి. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవ్వగా.. రాష్ట్రం నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం విశేషం. వీరికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

