
విడుదలకు సిద్ధమవుతున్న ఘాటి సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో సమావేశమైంది. లీడ్ యాక్ట్రెస్ అనుష్క శెట్టి సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై వచ్చిన ప్రశ్నలకు క్రిష్ స్పందిస్తూ, “ప్రమోషన్లకు హాజరుకావడం లేదా హాజరు కాకపోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఘాటి చిత్రానికి అనుష్క ప్రమోషన్స్ అవసరం లేదు.. ఆమె నటన ఉంటే చాలు అని క్రిష్ జాగర్లమూడి అన్నారు. ‘శీలావతి’ పాత్రలో అనుష్క తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది” అని నమ్మకంగా చెప్పారు.