భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమె 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని, ఏపీ శాప్ చైర్మన్ రవి హామీ ఇచ్చారు.

