
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చిత్తూరు నగరంలోని నడి రోడ్డుపై నడిపించుకుంటూ నిందితులను కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మురకంబుట్ట నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై ముగ్గురు యువకులు దాడి చేసి.. బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.