అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్ మాజ్రా దేశం విడిచి ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న పఠాన్ మాజ్రా.. ఆస్ట్రేలియాకు చెందిన ఒక పంజాబీ వెబ్ ఛానల్‌కు వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై దాఖలైన ఈ కేసు కేవలం రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల కోసం మాట్లాడే గొంతుకలను అణచివేయడమే ఈ కుట్ర వెనుక లక్ష్యమని ఆయన ఆరోపించారు.

