
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ సోదరుడు సమీర్ మోడీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్తున్న సమయంలో సమీర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సమీర్‌తో గతంలో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. సమీర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. ఒక రోజు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిసింది.