గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు, మీడియాకు మహేష్, రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల ఓర్పు, క్రమశిక్షణను రాజమౌళి ప్రశంసించారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి వస్తున్న ఆదరణకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. “నా అభిమానులు, మీడియా, దూర ప్రాంతాల నుండి వచ్చి చిత్ర బృందాన్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించి ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అతి త్వరలో మనందరం మళ్లీ కలుద్దాం” అని మహేష్ బాబు పోస్ట్ చేశారు.

