
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అడవిలో ఓ గ్రామానికి వెళుతూ ఏడు కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. బీంపూర్ మండలంలోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్ పూర్ గ్రామాలను సందర్శించి
ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని గ్రామ పేరును కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. అదేవిధంగా గ్రామాలలో మాదకద్రవ్యాలకు దూరం ఉండేలా, ఎలాంటి గంజాయిని పండించకూడదని, ఎవరూ సేవించకూడదని తెలిపారు.