
విశాఖపట్నం సముద్రతీరంలో రెండు రోజులుగా సాగిన బిమ్స్టెక్ పోర్ట్స్ కాన్క్లేవ్ అట్టహాసంగా ముగిసింది. నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కాన్క్లేవ్ రెండవ రోజు మరింత గణనీయంగా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంత అభివృద్ధి, నౌకాశ్రయాల సామర్థ్యం పెంపు, క్రూయిజ్ పర్యటనల విస్తరణ, మానవ వనరుల సద్వినియోగం వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం బిమ్స్టెక్ దేశాల మధ్య వాణిజ్యం కేవలం 7% మాత్రమే ఉండటం ఆందోళనకరం అని నిపుణులు అభిప్రాయపడ్డారు.