బీహార్ ఎన్నికల్లో మరీ దారుణ ఫలితం దక్కించుకున్న కాంగ్రెస్ కూడా ఓటమిపై స్పందించింది. పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం దీనిపై వ్యాఖ్యానించారు. ఓటమిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకుంటామని వివరించారు. అయినా ఎన్నికల ప్రక్రియ ఆది నుంచే సాగిన అక్రమ వ్యవహార క్రమంలో తాము గెలవలేకపోయామని రాహుల్ స్పందించారు. మహాఘట్‌బంధన్ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన లక్షలాది మంది ఓటర్లకు తమ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

