
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (ఎన్ఎస్ఈ) బెల్ మోగించారు. తద్వారా ఎన్ఎస్ఈ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. వివరాలు… నందమూరి బాలకృష్ణ సోమవారం రోజున ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ను సందర్శించారు. బాలకృష్ణ వెంట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే నందమూరి బాలకృష్ణకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.