సమాజంలో పరువు పోగొట్టుకున్నప్పటికీ, టీటీడీ చైర్మన్గా కొనసాగుతుండడం అనైతికమని, ఇప్పటికైనా పునరాలోచించాలని కోరుతూ బీఆర్ నాయుడు బస చేస్తున్న హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్లిన వైసీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు భౌతికదాడికి పాల్పడ్డాయి. కనీసం మహిళలన్న గౌరవం కూడా లేకుండా దాడికి పాల్పడ్డాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నిరసన ప్రదర్శించింది. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి టీటీడీ ప్రతిష్టను కాపాడాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

