
కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీడియా ముందుకు వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారు కాబట్టే కవితను హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి సత్యవతి రాథోడ్.. కవిత సస్పెన్షన్ గురించి స్పందించారు. పేగు బంధం కంటే.. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కోట్ల మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టం చేశారు.