భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న భారత వైస్ కెప్టెన్ 10 వేల పరుగుల క్లబ్లో చేరింది. అంతర్జాతీయంగా ఈ మైలురాయిని అధిగమించిన నాలుగో క్రికెటర్గా, రెండో భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. త్రివేండ్రంలో జరుగుతున్న నాలుగో టీ20లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఈ క్లబ్లో చేరింది. మంధాన కంటే ముందు మిథాలీ రాజ్ ఈ క్లబ్లో చేరింది.

