అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్ యువ జట్టు పాకిస్థాన్ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 253 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ లక్ష్యాన్ని 33.3 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది.

