
రాష్ట్రంలోని అ న్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేసింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటు కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జా రీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రి జిస్టరైన అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెం బర్లు ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేయడంతో పా టు కేసులు నమోదు చేస్తామని రవాణా శాఖ హె చ్చరించింది.