
తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ మరో శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లోనే గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేసి, నియామక పత్రాలు అందజేస్తామని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ ఆయన ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ప్రారంభించారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేశారు.