
భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. ‘వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్(DEW) ఎంకే-II(ఏ) ల్యాండ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఇది యూఏవీ, డ్రోన్లను విజవయంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతోపాటు నిఘా సెన్సార్లను పనిచేయకుండా చేసింది. దీని ద్వారా లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది’ అని డీఆర్డీవో తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది.