
ఏ అంశమైనా వివాదాస్పదం అవ్వదేమో గానీ.. భూముల విషయాలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. చాలా భూముల్లో ఆక్రమణలు, కబ్జాలు ఉంటుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే.. ప్రక్షాళన జరగదు. అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోకస్ పెట్టే పనిని జిల్లాల్లో తహసీల్దార్లకు అప్పగించింది. తమ చేతికి అస్త్రం రావడంతో తహసీల్దార్లు రెడీ అయ్యారు. ఇక వీళ్లు అన్ని భూముల రిజిస్ట్రేషన్లనూ పరిశీలించబోతున్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యబోతున్నారు. ఈ విషయంలో రాజీ ప్రసక్తే ఉండకూడదని రెవెన్యూ శాఖ చెప్పడంతో.. తహసీల్దార్లు జోరుగా ఉన్నారు.